కరెంట్ విషయంలో స్పీడ్​గా స్పందిస్తున్నం : డిప్యూటీ సీఎం భట్టి 

కరెంట్ విషయంలో స్పీడ్​గా స్పందిస్తున్నం : డిప్యూటీ సీఎం భట్టి 
  • 1912 కాల్ సెంటర్‌‌లో సంస్కరణలు చేస్తున్నం: డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, వెలుగు: కరెంట్  విషయంలో స్పీడ్ గా స్పందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రెస్పాండ్  నంబర్ 1912 కాల్ సెంటర్‌‌లో సంస్కరణలు చేస్తున్నామని చెప్పారు. గురువారం ప్రజాభవన్​లో మీడియాతో భట్టి డుతూ 1912 అప్లికేషన్  సాఫ్ట్‌‌వేర్  మళ్లీ రూపొందించామని చెప్పారు.

పవర్ సమస్యల విషయంలో అధికారులు వెంటనే రెస్పాండ్  అయ్యేలా చూస్తున్నామన్నారు. ప్రతి షిఫ్ట్‌‌కు కాల్  రిసీవర్లను 10 నుంచి 30 మందికి పెంచామని, కాల్ వెయిటింగ్  లేకుండా నేరుగా ఫోన్ లో సమాధానం ఇచ్చేందుకు చానెల్‌‌ల సంఖ్యను 400కి పెంచామని వివరించారు.