ముదిగొండ, వెలుగు: నియోజకవర్గంలోని ప్రతి పల్లెల్లో గల్లీలన్నీ సీసీ రోడ్లు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ముదిగొండ మండలంలో ఆయన పర్యటించారు. పలు గ్రామాల్లో బీడీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్లను నాణ్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఆర్డీవో సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీవో జి. గణేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.