టాలీవుడ్కు గుడ్ న్యూస్..ఉగాది నుంచి గద్దర్ అవార్డుల ప్రదానం

ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు భట్టి.

 జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆవార్డులు అందజేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. సెక్రటేరియెట్ లో అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ, నిబంధనల పై  కమిటీ  సమావేశం జరిగింది. ఫీచర్ ఫిల్మ్ లు, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై పుస్తకాలు వంటి వివిధ విభాగాల కింద అవార్డులు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 

ALSO READ | డియర్ అన్నయ్యా.. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని.. ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తోంది: థమన్

రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు భట్టి. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయస్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని డిప్యూటీ సీఎం సూచించారు. కల్చరల్ ఐకాన్ గద్దర్ ప్రతిష్ట పెంచేలా అవార్డుల లోగోలు రూపొందించాలని డిప్యూటీ సీఎం తెలిపారు.  సినిమా నిర్మాణంలో హైదరాబాద్ ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

గత పది సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని  పరిపాలించిన వారు చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారన్నారు, అవార్డుల పంపిణీ జరగలేదని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు డిప్యూటీ సీఎం.రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ప్రతి ఏటా అందజేయాలని నిర్ణయించి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులు ఈ ఉగాది నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వనున్నట్టు తెలిపారు డిప్యూటీ సీఎం.