ఏప్రిల్ 14 తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు: భట్టి విక్రమార్క

ఏప్రిల్ 14 తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు: భట్టి విక్రమార్క

ఇవాళ (ఏప్రిల్ 14) తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూభూరతి పోర్టల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన భట్టి.. బాబా సాహెబ్ ఆలోచనలకు అనుగుణంగా భూభారతి తెచ్చామన్నారు. సామాన్య రైతులకు అర్తమయ్యేలా భూభారతి తీసుకొచ్చామన్నారు.  

గత బీఆర్ఎస్ సర్కార్ 24 లక్షల ఎకరాల హక్కులను  కాలరాసిందని ఆరోపించారు భట్టి.  ధరణి రైతుల పాలిటి శాపంగా మారింది.  రైతుల ఆత్మగౌరవాన్ని ధరణితో తాకట్టు పెట్టారు.   ధరణి సమస్యలను ప్రస్తావించినా గత ప్రభుత్వం పట్టించుకోలె. ధరణితో ఎంతో మంది రైతులు కన్నీళ్లు పెట్టారుధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడే చెప్పినం. భూమి అంటే నమ్మకం, ఆత్మ గౌరవం.  ప్రజలకు పనికొచ్చే చట్టం తెస్తామన్నాం..చెప్పినట్టు చేశాం. హక్కులు కోల్పోయిన రైతులకు హక్కులు కల్పించేందుకు భూ భారతి తెచ్చాం.  భూ భారతిని ప్రజలకు అంకితం చేస్తున్నం. 

పదేళ్లలో అసైన్ మెంట్ కమిటీలు లేవు. అసైన్ మెంట్ కమిటీని పునురుద్ధరిస్తాం.  ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారికి పట్టాలిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ప్రజలు నమ్ముతున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం చట్టాలు తెస్తుంది కానీ పాలకుల కోసం కాదు.  గత సర్కార్ హయాంలో తహసీల్దార్ పై పెట్రోల్ పోసి  రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.  భూమికి, రైతులకు విడదీయలేని  బంధం ఉంది ఆ బంధం అలాగే  ఉంచాలి.మొదటి సారి రైతులకు పట్టాలిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం  అని భట్టి అన్నారు.