కులగణనతో దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పగడ్భందీగా సర్వే చేశామన్నారు. లక్ష మంది సిబ్బందితో సర్వే చేశామని.. ఈ కులగణన తెలంగాణ ఎక్స్ రే అని అన్నారు. సర్వే ఎలా జరిగిందో త్వరలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామన్నారు భట్టి. సర్వే జరిగిన తీరు ప్రజలకు తెలియాలన్నారు.
మీడియాతో మాట్లాడిన భట్టి... కులగణన చేస్తామని రాహుల్ మాటిచ్చారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడగానే ఈనిర్ణయం తీసుకున్నాం. కులగణన సర్వే హడావిడిగా చేసింది కాదు. సుధీర్ఘ కసరత్తు తర్వాత సర్వే చేశాం. నాలుగు జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టాం. బ్లాకులుగా ఏర్పాటు చేసుకుని సర్వే చేపట్టాం. ఎక్కడా పొరపాటు లేకుండా జాగ్రత్త పడ్డాం. ఎన్యుమరేటర్లకు ట్రైనింగ్ కూడా ఇచ్చాం.
Also Read : హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోళ్లకు భారీ డిమాండ్
లక్ష మంది సిబ్బంది ఈ సర్వేలో భాగమయ్యారు. సర్వే జరగొద్దని చాలా కుట్రలు చేశారు.ఎన్నికుట్రలు చేసినా సర్వే ఆగలేదు. సహకరించిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు. ఈ సర్వే జరిగిన తీరుపై త్వరలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తాం. సర్వే ఎలా జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలియాలి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం చూపాం.దేశ వ్యాప్తంగా కులగణన చేయాలి అని భట్టి అన్నారు.
కులగణన సర్వేకు ఫిబ్రవరి 4న తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీసీల లెక్కను తగ్గించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో భట్టి వివరణ ఇచ్చారు.