తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల జాతర నిర్వహిస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో దాదాపు 25 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను ఇప్పటివరకు అందించారని చెప్పారు. గతంలో సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం కొట్లాడేవారు.. ఇప్పుడు ప్రతి వారం ఏదో ఒక ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.
బీఆర్ఎస్ పదేళ్లపాటు గ్రూప్ 1 కి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే గ్రూప్ 1 నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. నిరుద్యోగులకి నోటిఫికేషన్లు ఇవ్వడంతోపాటు.. ఉచితంగా ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అవ్వటానికి ప్రతి నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.