ఉమ్మడి ఖమ్మం జిల్లాను టూరిజం సెంటర్​గా మారుస్తాం : సీఎం భట్టి విక్రమార్క

ఉమ్మడి ఖమ్మం జిల్లాను టూరిజం సెంటర్​గా మారుస్తాం : సీఎం భట్టి విక్రమార్క
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టూరిజం మినిష్టర్​ జూపల్లి కృష్ణారావు 
  • జిల్లాలో  పర్యాటక కేంద్రాలను, అభివృద్ధి పనులను  పరిశీలించిన  మంత్రులు 

భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ రూరల్​/వైరా వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాను  టూరిజం సెంటర్​గా మారుస్తామని,   భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసానిని, వైరా రిజర్వాయర్​ను   టూరిజం హబ్​గా రూపొందించేందుకు ప్లాన్​ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జిల్లాలోని పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో టూరిజం మినిస్టర్​ జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి సోమవారం పర్యటించారు.  లక్ష్మీదేవిపల్లి మండలంలోని కొత్తగూడెం క్రాస్​ రోడ్డులో నిర్మిస్తున్న బడ్జెట్​ హోటల్​ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం టూరిజానికి పెద్దపీట వేస్తొందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బౌద్దారామం, ఖమ్మం ఖిల్లా, కిన్నెరసాని పర్యాటక కేంద్రాలను పరిశీలించామన్నారు.  

పర్యాటకానికి పర్యాయ పదంగా ..

పర్యాటకానికి పర్యాయ పదంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను రూపొందించనున్నట్టు టూరిజం మినిష్టర్​ జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కిన్నెరసానిలోని అద్దాల మేడ గురించి  అధికారులను అడిగి తెలుసుకున్నారు.  టూరిజంతో ఆర్థికంగా రాష్ట్రం ఎదిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రకృతి రమణీయత, ఆహ్లాదకరమైన వాతావరణంఉన్న  కిన్నెరసానిని త్వరలో  అద్బుతమైన  టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు నిపుణులను త్వరలో పంపించనున్నట్టు తెలిపారు. వరల్డ్​ బెస్ట్​ కన్సల్టెన్సీనికి  కిన్నెరసాని అప్పగిస్తామని తెలిపారు. 

కేంద్రం, రాష్ట్రం నిధులతో పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. వాటర్​ స్పోర్ట్స్​, కాటేజీలు, ఐల్యాండ్స్​, రిక్రియేషన్స్​, వెడ్డింగ్​ డిస్టినేషన్​ సెంటర్​గా  ​మార్చేందుకు కిన్నెరసాని అనుకూలంగా ఉందన్నారు. కనీసం నెలలో ఒక రోజు ప్రజాప్రతినిధులు, అధికారులు టూరిజం స్పాట్స్​కు వెళ్లేలా ప్లాన్​ చేసుకోవాలన్నారు. టూరిజం డెవలప్​మెంట్​లో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీల యాజమాన్యాలతో హైదరాబాద్​లో త్వరలో మీటింగ్​ ఏర్పాటు చేస్తామన్నారు.   

సీఎం ను తీసుకువస్తా.. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టూరిజం డెవలప్​మెంట్​లో భాగంగా సీఎం రేవంత్​ రెడ్డిని తీసుకువస్తానని జూపల్లి అన్నారు. కిన్నెరసానిని టూరిజం హబ్​గా రూపొందించడంలో భాగంగా రెవెన్యూ, సింగరేణి, కేటీపీఎస్​, ఫారెస్ట్​ ఆఫీసర్లతో త్వరలో స్పెషల్​ మీటింగ్​ పెట్టనున్నట్టు తెలిపారు. 

పర్యాటక కేంద్రంగా వైరా రిజర్వాయర్ 

నిధులు కేటాయించి వైరా రిజర్వాయర్​ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. స్థానిక  ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి సోమవారం సాయంత్రం ఇక్కడ పర్యటించారు. వైరా రింగ్ రోడ్డు నుంచి  తల్లాడకు రోడ్డు ,  వసతి భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.   కార్యక్రమంలో  గిడ్డంగుల  సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, టూరిజం కార్పొరేషన్​ చైర్మన్ పటేల్ రమేశ్​ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్,  రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్ పాల్గొన్నారు.

అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష 

ఖమ్మం రూరల్ : మండలం సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఖరీప్ పంటల సాగు, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యదర్శులు , వ్యవసాయ శాఖ ఏఈఓలు తాము డ్యూటీ చేసే గ్రామాల్లోనే ఉండాలని తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా లాంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో అవసరాన్ని బట్టి మరో పంచాయతీ కార్యదర్శిని కూడా నియమించాలని సూచించారు. ఏడాదిలోపు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల సమస్య తీరుతుందని, అత్యవసరమైనవి తన దృష్టికి తెస్తే తక్షణమే నిర్మించేలా  చూస్తానని పేర్కొన్నారు. 

పలువురు సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి పాఠశాలలకు 200మీటర్ల లోపు కూడా మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారని,  వాటి వివరాలను సేకరించి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది ఎవరూ ప్రజలను వేధించొద్దని, గ్రామపంచాయతీ పరిధిలో వికలాంగుల, వృద్ధాప్య, వితంతు మొదలగు పెన్షన్ కు అర్హులైన వారిని గుర్తించాలని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు.