ఆందోళన వద్దు.. 6వేల పోస్టులతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ : భట్టి విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణలో డీఎస్సీ వాయిదా వేయాలని అక్కడక్కడా ఆందోళనలు చేస్తున్నారని.. డీఎస్సీ ఆలస్యమైతే అభ్యర్థులకు మరింత నష్టం జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో ఐదు నుంచి ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఎవరూ ఆందోళన చేయవద్దని ఆయన అభ్యర్థలను ఆయన కోరారు. భట్టి విక్రమార్క ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు అందరం చూశామన్నారు. 

ఈ డీఎస్సీ పరీక్షకు అభ్యర్థులు హాజరు అవ్వండి. త్వరలోనే ఐదు లేదా ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీని నిర్వహిస్తాం. ఈసారి పరీక్షల కోసం ఇప్పటికే రెండు లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారని ఉపముఖ్యమంత్రి సూచించారు. 

ALSO READ | పరీక్షలు వాయిదా వేస్తే.. పెంచిన ఏజ్ లిమిట్ సరిపోదు : మంత్రి సీతక్క

రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని భట్టి గుర్తి చేశారు. కష్టపడి చదివిన వారందరూ ఉద్యోగాలు తెచ్చుకుని స్థిరపడాలనేదే మా ఆశ. కొన్ని నెలల తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్-1 నిర్హహించలేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మేము రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల నియామకాలు చేపట్టాం. 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.