దోచుకున్న సొమ్ము విదేశాల్లో దాచారు.. ప్రజల్లోకి ఏ మొఖం పెట్టుకుని వస్తవ్ కేసీఆర్

దోచుకున్న సొమ్ము విదేశాల్లో  దాచారు.. ప్రజల్లోకి  ఏ మొఖం పెట్టుకుని వస్తవ్ కేసీఆర్

బీఆర్ఎస్ నేతలు దోచిన సొమ్మును విదేశాల్లో దాచిపెట్టారని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రామగుండం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన..  ఏ మొహం పెట్టుకుని  కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ కానీ రైతులెవరూ అధైర్య పడొద్దని సూచించారు. గత  ప్రభుత్వ హయాంలో  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. 

  కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ సమయంలో ప్రజల మనసులు గెలుచుకుందన్నారు భట్టి.  ఉద్యోగులకు ప్రతి నెల ఫస్ట్ కే జీతాలిస్తున్నామని చెప్పారు.  రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పాం చేసి చూపించామన్నారు.  కార్మికుల సంక్షేమం కోసం రూ. కోటితో ఇన్సురెన్స్ చేశామన్నారు.   విద్యుత్ కార్మికులు 24 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. థర్మల్ పవర్ ప్రాజెక్టు పెడ్తాం..  సోలార్ పవర్ ప్రాజెక్టు  తెస్తామన్నారు భట్టి. పవర్ సర్ ప్లస్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ను అమ్ముతామన్నారు.  సోలార్ పవర్ ప్లాంట్ లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

ఏటా మహిళలకు 20 వేల వడ్డీలేని రుణాలిస్తామన్నారు భట్టి విక్రమార్క. తమ ప్రభత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు పెడతామన్నారు.  గురుకులాల్లో చదివే బిడ్డలకు బెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కట్టి తీరుతామన్నారు.  సంపద మొత్తం  ప్రజలకు పంచిపెడుతున్న ప్రభుత్వం తమదన్నారు భట్టి.