అంబానీ, అదానీలకే కాదు.. రాష్ట్ర మహిళలకూ సోలార్​ ప్రాజెక్టులు : భట్టి​ విక్రమార్క

అంబానీ, అదానీలకే కాదు.. రాష్ట్ర మహిళలకూ సోలార్​ ప్రాజెక్టులు : భట్టి​ విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: అంబానీ, అదానీలకే కాకుండా రాష్ట్రంలోని మహిళలకూ సోలార్  పవర్  ప్రాజెక్టులను కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవించడమే కాకుండా వారిని కోటీశ్వరులుగా తయారు చేస్తామని, అదే ప్రజాప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్  దస్పల్లా హోటల్ లో సోమవారం అసోసియేషన్  ఆఫ్  లేడీ ఎంటర్‌‌ప్రెన్యూర్స్  ఆఫ్  ఇండియా 31వ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి  డిప్యూటీ సీఎం భట్టి హాజరై మాట్లాడారు. శిల్పారామం దగ్గర డ్వాక్రా మహిళా సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఏర్పాటు చేసిన మహిళా శక్తి బజారును ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని, ఇందుకు యాక్షన్  ప్లాన్  రూపొందించామని చెప్పారు.