
బీఆర్ఎస్ లీడర్లు గ్రామాలకు వస్తే ప్రజలు నిలదీయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వనపర్తి సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రజా సమస్యలను పరిష్కరించలేని సన్నాసి. రాష్ట్రాన్ని దోచుకున్నవాళ్లు(బీఆర్ఎస్ నేతలు) ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించటం మానుకోవాలి’’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పాలనలో ఎందుకు చేయలేదో ఆ పార్టీ నేతలను ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు.
గడీ నుంచి బయటికు రాని పెద్ద మనిషితో పాటు కేటీఆర్, హరీశ్‌రావు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడడం బాధాకరం” అని అన్నారు. మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ స్కీమ్‌ను ఇప్పుడు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు పదేండ్లు పాలించినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గ్రూపులకు ఏప్రిల్ 14 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలోగా లోన్లు పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు.