సింగరేణిని రాజకీయాలకు వాడం.. బలమైన ఆర్థిక శక్తిగా మారుస్తాం: భట్టి

 సింగరేణిని రాజకీయాలకు వాడం.. బలమైన ఆర్థిక శక్తిగా మారుస్తాం: భట్టి

సింగరేణిని బలమైన ఆర్థిక శక్తిగా మారుస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్ లో రాజీవ్ అభయ హస్తం స్కీం లాంచ్ సందర్భంగా మాట్లాడారు భట్టి. సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సింగరేణి కాలరీస్ తెలంగాణ రాష్ట్రానికి తలమానికం లాంటిదన్నారు.  గత ప్రభుత్వం సింగరేణిని రాజకీయల కోసం వాడుకుందన్నారు.  తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సింగరేణి అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు భట్టి. ఇతర రాష్ట్రాలలో కూడా విస్తరించి  సింగరేణిని బలమైన శక్తిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.

 ప్రమాదంలో చనిపోయిన కార్మకుల కుటుంబానికి రూ.కోటి రూపాయల పరిహారం  కేవలం తెలంగాణలోనే ఉందన్నారు భట్టి.  బ్యాంకర్లతో మాట్లాడి దీనిని రూ. కోటి 25 వేలకు పెంచే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.  కోల్ బెల్ట్ లో ఉన్న నియోజకర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు భట్టి.   కోల్ తవ్వకాల వలన ఖాళీగా ఉన్న ప్రాంతాలను గ్రీన్ ఎనర్జీ కోసం వినియోగిస్తామన్నారు భట్టి. 

Also Read :- చిక్కడపల్లి పీఎస్కు అల్లు అర్జున్

సివిల్స్ ప్రిలిమ్స్ కు ఎంపికై  రాష్ట్రానికి పేరు తెచ్చే నిరుద్యోగ యువతీ యువకులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. 40 మంది ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ కు ఎంపికైన వారికి గతంలోనే లక్ష చెక్కు అందేజేశాం... మళ్లీ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మందికి కూడా లక్ష రూపాయల సాయం చేస్తున్నామన్నారు.   ఇంటర్వ్యూ సమయంలో 20 మందికి ఢిల్లీలో వసతి కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. యూపీఎస్సీలో తెలంగాణ యువత రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.