పోరాట స్ఫూర్తి తెలంగాణ తల్లి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని అన్నారు. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము మార్చలేదని చెప్పారు. చాలా రాజకీయ పార్టీలు అనేక రూపాలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాయన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అధికారికంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇకపై ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు భట్టి.
ALSO READ | తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్
డిసెంబర్ 9కి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు భట్టి విక్రమార్క. నీళ్లు, నిధులు,నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందన్నారు రేవంత్. మిగులు బడ్జె్ట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే .. రూ.7 లక్షల కోట్ల అప్పలు చేసిందని విమర్శించారు. ప్రజలను బంధీ చేసి పాలన చేశారన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకునే స్వేచ్ఛ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో భావ స్వేచ్ఛ కనిపిస్తోందన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించారమన్నారు. రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ .. 50 వేలకు పైగా ఉద్యోగాలిచ్చాం. మహిళలకు లక్ష కోట్లరుణాలివ్వబోతున్నామని తెలిపారు భట్టి విక్రమార్క.