- నోటిఫికేషన్ పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ గురుకులాల్లో చేరాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా గురుకులాలను ఎంచుకోవాలన్నారు. గురుకులాలు అంటే మంచి చదువు, క్రమశిక్షణను అలవర్చే కుటీరాలని తెలిపారు. వచ్చే అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ పోస్టర్‌ను శనివారం ప్రజా భవన్ లో బీసీ , ఎస్సీ, ఎస్టీ గురుకుల సెక్రటరీలు సైదులు, అలుగు వర్షిణి, సీతాలక్ష్మిలతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి ఆవిష్కరించి మాట్లాడారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మేర మెస్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీలను పెంచినట్లు పేర్కొన్నారు. ఐదు నుంచి 9వ తరగతి వరకు..రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ,బీసీ గురుకులాలలో ప్రవేశాలకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ను వచ్చే నెల 23న నిర్వహిస్తుండగా, అప్లై చేసుకునేందుకు వచ్చే నెల 1 వరకు గడువు ఉంది. రాష్ట్రంలో గురుకుల అడ్మిషన్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆటోల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు అలుగు వర్షిణి పేర్కొన్నారు.