పెద్దపల్లి/గోదావరిఖని, వెలుగు : ఈనెల 31న రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారని పెద్దపల్లి కలెక్టర్ గురువారం తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9.45 గంటలకు రామగుండంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 10 నుంచి 10:30 గంటల వరకు టీజీ జెన్ కో 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్ సైట్‌ను సందర్శిస్తారు. అనంతరం గోదావరిఖని లో నిర్మించిన స్కిల్ సెంటర్ సెక్టార్ 2 ను ప్రారంభిస్తారు.
అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో టీయూఎఫ్ఐడీసీ అమృత్ 2 నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో నిర్వహించే బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. కాగా డిప్యూటీ సీఎం రాక సందర్భంగా డిగ్రీ కాలేజీలోని హెలీప్యాడ్ ప్రాంతాన్ని అడిషనల్ కలెక్టర్ జె.అరుణశ్రీ, ఏసీపీ రమేశ్, కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్, తహశీల్దార్ కుమారస్వామి, తదితరులు పరిశీలించారు.