మున్నేరు బాధితులను ఓదార్చిన డిప్యూటీ సీఎం భట్టి

మున్నేరు బాధితులను ఓదార్చిన డిప్యూటీ సీఎం భట్టి

ముదిగొండ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో పర్యటించారు. న్యూలక్ష్మీపురం, పండ్రేగుపల్లి గ్రామాల్లో మున్నేరు వరద ముంపు ప్రాంతాలను భట్టీ పరిశీలించారు. న్యూ లక్ష్మీపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో వరదనీరు వచ్చిన ఇళ్లను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. పండ్రేగుపల్లిలో మున్నేరు కరకట్ట తెగి వరద నీటిలో మునిగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీని, పంటపొలాలను సందర్శించారు. 

అదే గ్రామంలో వర్షాలకు దెబ్బతిని కూలిపోయిన వజీర్ పాషా రేకుల ఇంటిని పరిశీలించి బాధితులకు అండగా ఉంటానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా నిచ్చారు. వరద ముంపు బాధితులకు తక్షణ సాయం కింద నిత్యవసర సరుకులను అందజేయాలని తహసీల్దార్ కరుణాకర్ రెడ్డిని ఆదేశించారు.  క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలు అందించాలని మండల వ్యవసాయ అధికారిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.