- భువనగిరికి అప్లై చేసుకున్న చామల
- కాంగ్రెస్ లోక్‌సభ టికెట్లకు 41 అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు : లోక్‌సభ ఎన్ని కల్లో పోటీ చేసేందుకు అప్లికేషన్లు పెట్టు కున్న కాం గ్రెస్ పార్టీ లీడర్ల సంఖ్య క్రమం గా పెరుగుతు న్నది. తొలి రోజు ఏడుగురే అప్లై చేసుకోగా.. రెండో రోజు 34 మంది అప్లికేషన్లు ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నంది ని ఖమ్మం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేం దుకు అప్లికేషన్ పెట్టుకున్నారు. గురు వారం ఆమె గాంధీ భవన్లో దరఖాస్తు సమ ర్పించారు.
భువనగిరి లోక్‌సభ స్థానం నుం చి పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్‌రెడ్డి దరఖాస్తు సమర్పించారు. ఆకుల లలిత, మందా జగన్నాథం, కె. నగేశ్ తదితరులు కూడా అప్లికేషన్లు ఇచ్చారు. ఇప్పటి దాకా మహ బూబాబాద్ లోక్‌సభ స్థానానికి 10, నాగర్‌కర్నూల్‌కు 10, భువన గిరికి 8, వరంగల్‌కు 7, నిజామాబాద్‌కు 3, ఖమ్మంకు 2, మల్కాజిగిరికి ఒకటి చొప్పున అప్లికేషన్లు అందాయి.