ధరణిని బంగాళాఖాతంలో వెస్తాం డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క

అదిలాబాద్:ప్రజల ఆశీర్వాదంతోనే ఇందిరమ్మ  రాజ్యం, ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీపుల్ష్ మార్చ్  పాదయాత్రను చేశాం.. ప్రజలు ఆశీర్వదించారు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. పాదయాత్రలో ప్రజల గోడును విన్నాకే వారి ఆకాంక్షల కోసమే పనిచేస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న ప్రజలకిచ్చిన మాటలను నిలబెట్టుకున్నామన్నారు. 

ఆడ బిడ్డలకిచ్చిన మాటకోసం ప్రభుత్వం ఏర్పాడి మొదటి రోజునే ఫ్రీ బస్ స్కీం ను ప్రారంభించామన్నారు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాల నియామక పత్రాలను అందించామన్నారు.  మరో 30 వేల ఉద్యోగాల కల్పన చేస్తామన్నారు. 

ALSO READ | పొంగిపొర్లుతున్న వాగులు వంకలు.. నిండుకుండలా రిజర్వాయర్లు.. అలుగు పారుతున్న చెరువులు

ధరణి ను బంగాళ ఖాతంలో వేస్తామన్నారు డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క. సమస్యలను.పరిష్కరిస్తాం చెప్పాం... ఇప్పటికే సబ్ కమిటీ వేశాం..సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. భూమి కోసం జరిగిన పోరాటాలు, వారికి హక్కు ప్రకారం చట్ట సభలు ద్వారా వారికి న్యాయం చేస్తాం. కుండలు చేసుకోవడానికి అడవి నుంచి మట్టి కూడా తేనివ్వలేదని,బుట్టలు అల్లుకోవడానికి వెదురుని కూడా తేనివ్వలేదని చెప్పారు.

అదిలాబాద్ జిల్లా ప్రజలను గుండెల్లో పెట్టుకొని కాపాడుతాం..ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి తీరుతామన్నారు. పింప్రి గ్రామకోసం 45 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్లు పనులను నిధులు కేటాయించి సస్యశ్యామలం చేస్తామన్నారు.