కల్లూరు, వెలుగు : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు లోహిత్ రెడ్డి రిసెప్షన్ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. కల్లూరు మండలం నారాయణపురం సమీపంలోని పీఎస్ఆర్ ప్యాలెస్ లో జరిగిన వేడుకలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
నూతన వధూవరులు పొంగులేటి లోహిత్ రెడ్డి, భవానిని ఆశీర్వదించారు. వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 500 మంది వివిధ హోదా కలిగిన పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది ,150 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ బందోబస్తు నిర్వహించారు.