వైరా, వెలుగు : డిప్యూటీ సీఎం హోదాలో మల్లు భట్టి విక్రమార్క తొలిసారిగా స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలోని శ్రీరామలింగేశ్వర ఆలయానికి ఆదివారం వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన వ్యవసాయ క్షేత్రం వద్ద తల్లిదండ్రులైన మల్లు అఖిలాండ దాసు, మాణిక్యమ్మ, సోదరుడు అనంతరాములు ఘాట్ వద్ద నివాళులర్పించారు.
అతకుముందు గండగలపాడులో కాంగ్రెస్ పార్టీ జెండాను భట్టి విక్రమార్క ఎగరవేసి , డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్తో కలిసి పూలమాల వేశారు. స్వగ్రామానికి తొలిసారిగా విచ్చేసిన భట్టికి వైరా మున్సిపాలిటీలోని పదో వార్డు కౌన్సిలర్ కర్నాటి నందిని హనుమంతరావుతో పాటు స్నానాల లక్ష్మీ పురం ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు ఉన్నారు.