మహనీయుడు జ్యోతిబాఫూలే : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మహనీయుడు జ్యోతిబాఫూలే : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్​సిటీ నెట్ వర్క్, వెలుగు: సామాజిక న్యాయం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. జూబ్లీహిల్స్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్(సీడీఎస్)లో శుక్రవారం నిర్వహించిన జ్యోతిబాఫూలే జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫూలే ఫొటోకు నివాళులర్పించారు. ఎస్సీ కార్పొరేషన్​ప్రిన్సిపల్​ సెక్రటరీ శ్రీధర్, సీడీఎస్​చైర్మన్​మల్లేపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి పాల్గొన్నారు.

బీసీ జేఏసీ, మహాత్మా జ్యోతిబాఫూలే ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఫిలింనగర్ ​చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫూలే దంపతుల విగ్రహాలను పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజూల శ్రీనివాస్​ గౌడ్, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, మాజీ ఎంపీ అంజన్​కుమార్​యాదవ్, సీనియర్​ జర్నలిస్టు పాశం యాదగిరి, ట్రైకార్​చైర్మన్​బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు.

లాలాపేట, తార్నాక చౌరస్తాలోని జ్యోతిబాఫూలే విగ్రహానికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి నివాళులర్పించారు. జ్యోతిబాఫూలేకు భారత రత్న ప్రకటించాలని ప్రొఫెసర్ ​కంచె ఐలయ్య డిమాండ్​చేశారు. ఫూలే జీవిత కథ ఆధారంగా నిర్మించిన చిత్ర ప్రదర్శనను అడ్డుకోవడం విచారకరమన్నారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదర్ గూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫూలే దంపతుల విగ్రహాలను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆవిష్కరించారు.

తెలంగాణ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యానగర్ జాతీయ బీసీ భవన్ లో ఎంపీ ఆర్.కృష్ణయ్యకు జ్యోతిబాఫూలే ఎక్స్​లెన్సీ అవార్డు ప్రదానం చేశారు. చిక్కడపల్లిలోని ఆఫీసులో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఫూలే జయంతి నిర్వహించారు.  బీసీ నేత వినోద్​కుమార్ ​నేతృత్వంలో వెంగళరావునగర్​కాలనీలో ఫూలే జయంతి నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ​మాజీ అధికార ప్రతినిధి డాక్టర్​పీవీ రవిశేఖర రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. నాంపల్లి గృహకల్పలో టీఎన్జీఓ సెంట్రల్, హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డోనేషన్ క్యాంప్ నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పాల్గొని ప్రారంభించారు. తలసేమియా, క్యాన్సర్ పేషెంట్ల కోసం క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు.