మల్లు వెంకటేశ్వర్లుకు డిప్యూటీ సీఎం నివాళి

 మల్లు వెంకటేశ్వర్లుకు డిప్యూటీ సీఎం నివాళి

వైరా, వెలుగు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి భట్టి దంపతులు హాజరయ్యారు. వెంకటేశ్వర్లు ఫొటోకు నివాళులర్పించారు. మండలం స్నానాల లక్ష్మీపురంలో సోదరుడు సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచారు. అనంతరం స్వగ్రామంలోని  రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలోరూ.4 కోట్లతో నిర్మాణం చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, శీలం వెంకట నర్సిరెడ్డి, దొడ్డా పుల్లయ్య, ఏదునూరి సీతరాములు, పమ్మి అశోక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు . 

నగదు రహిత వైద్యం అందించాలని వినతి

రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని ఆ సంఘం రాష్ట్ర  కార్యదర్శి పైడిపల్లి శరత్ బాబు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కళ్యాణం కృష్ణయ్య ఆధ్వర్యంలో వైరాలో డిప్యూటీ సీఎం భట్టికి వినతి పత్రం అందించారు. ఈ కార్య క్రమంలో జిల్లా కౌన్సిలర్ చల్లా కృష్ణా రావు, వైరా మండల కమిటీ అధ్యక్షుడు పీ.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య సూరి, కోశాధికారి పెంటయ్య, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.