130 బెడ్ల ప్రైవేట్​ హాస్పిటల్​ ప్రారంభం

130 బెడ్ల ప్రైవేట్​ హాస్పిటల్​ ప్రారంభం

ఖమ్మం టౌన్,వెలుగు : ఖమ్మం లోని నెహ్రూ నగర్ లో కొత్తగా నిర్మించిన స్తంభాద్రి హాస్పిటల్ ను ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... ఉమ్మడి జిల్లాలతో పాటుగా నల్గొండ,వరంగల్ జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు స్తంబాద్రి ఆస్పత్రిని నెలకొల్పడం హర్షణీయమన్నారు. అనంతరం ఆస్పత్రి డాక్టర్లు మాట్లాడారు.

130 బెడ్లతో ఆసత్పిలో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీలు నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీ నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ

వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.మాలతి, ఐఎంఏ అధ్యక్షుడు కంభంపాటి నారాయణ రావు, ఆస్పత్రి న్యూరో సర్జన్ సురేశ్​, ఆర్థో డాక్టర్ అనిల్ కుమార్, యురాలజిస్టు గుమ్మడి రాఘవేంద్ర,కార్డియాలజిస్టు హర్షతేజ, ఎండీ జనరల్ మెడిసిన్ డొగిపర్తి కృష్ణ సుమంత్ పాల్గొన్నారు.