మధిర నియోజకవర్గ ప్రజలకు..మెరుగైన వైద్యసేవలు అందించాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మధిర నియోజకవర్గ ప్రజలకు..మెరుగైన వైద్యసేవలు అందించాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా  మధిర నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి నిర్వాహకులకు  డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క సూచించారు. ఆదివారం మధిర కేవీఆర్​ జనరల్ ఎమర్జెన్సీ ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కేవీఆర్​ ఆసుపత్రిలో ప్రారంభించిన ఆరోగ్య శ్రీ సేవలను మధిర నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అంతుకుముందు భట్టికి ఆసుప్రతి వైద్యులు కోట రాంబాబు, అరుణకుమారి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మధిర కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మిర్యాల రమణ గుప్త , లావణ్య దంపతుల కుమార్తె  సాత్విక-, స్వరాజ్​ రంగా వివాహానికి డిప్యూటీ సీఎం హాజరయ్యారు. 

సమస్యలన్నీ పరిష్కరిస్తా..

ముదిగొండ : తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను పరిష్కారిస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మండల పరిధిలోని న్యూలక్ష్మీపురంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం గంధసిరి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మట్ట వెంకటేశ్వర్లు రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

మట్ట జనార్ధన్ రెడ్డి రమాదేవి దంపతుల కుమారుడు గోపీనాథ్ రెడ్డి చందన వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. బానాపురం గ్రామంలో అండర్ 17 క్రికెట్ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు ఎర్ర రచిత, బెండు రేవతిని అభినందించారు.  పలుచోట్ల ఆయనకు పలువురు ఆయా సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు.