
న్యూఢిల్లీ, వెలుగు: ఏప్రిల్ 8, 9వ తేదీల్లో అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాల డ్రాఫ్టింగ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం కల్పించింది. మొత్తం 15 మందితో కూడిన కమిటీని సోమవారం పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు.
ఈ కమిటీకి కన్వీనర్ గా రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా, సభ్యులుగా జైరాం రమేశ్, తారీఖ్ అన్వర్, దీపాదాస్ మున్షి, భూపేశ్ బాఘేల్, సచిన్ పైలట్, రజనీ పాటిల్, పీఎల్ పునియా, బీకే హరి ప్రసాద్, గౌరవ్ గోగోయ్, మనీశ్ తివారి, విజయ్, మల్లు భట్టి విక్రమార్క, బెన్ని బెహనాన్, విక్రాంత్ భూరియాలకు అవకాశం కల్పించారు.