- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- రూ.23.90కోట్ల పనులకు శంకుస్థాపన
మధిర, వెలుగు: రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు చేపట్టడంతో పాటు అగ్రిమెంట్ సమయం లోపు పనులు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో --రూ.23.90కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అన్నారు. చింతకాని మండలంలో నాగులవంచ తిర్లాపురం ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి చింతకాని వయా తుమ్మలచెరువు రోడ్డు, నాగులవంచ నుంచి తిమ్మినేనిపాలెం తిర్లాపురం క్రాస్ రోడ్డు వరకు, బోనకల్లు నుంచి రాయన్నపేట వరకు చేపట్టే రోడ్డు పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.