
ఖమ్మం, వెలుగు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్సనల్ అసిస్టెంట్ తక్కెళ్లపల్లి శ్రీనివాస్ (50) సోమవారం గుండెపోటుతో చనిపోయారు. ఖమ్మం బైపాస్ రోడ్‌లోని టీఎన్జీవోస్ కాలనీలో ఉన్న ఆయన సొంత ఇంటిలోనే కన్నుమూశారు. ఐసీడీఎస్ డిపార్ట్‌మెంట్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ డిప్యూటేషన్‌పై ఆరేండ్లుగా భట్టి విక్రమార్కకు పర్సనల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
శ్రీనివాస్ మృతి విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని సహా పలువురు ప్రముఖులు, ఆఫీసర్లు, టీఎన్జీవో నేతలు శ్రీనివాస్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీనివాస్ ఇంటికి చేరుకొని నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.