ఈ సందర్భంగా క్షేత్రస్థాయి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉందని, విద్యుత్తు, నిత్యవసర వస్తువుల సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
విపత్తుల సమయంలో ముందుగా నష్టపోయేది విద్యుత్ శాఖేనని, సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయి ఆఫీసర్లు అమలు చేయాలన్నారు. విద్యుత్తు స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, మిగతా మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
శిథిల భవనాల్లో ఎవరూ ఉండొద్దు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలమైన పురాతన భవనాల్లో ఉండకుండా వెంటనే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలకు సూచించారు. విద్యుత్తు సమస్యలు ఉంటే డయల్ 1912, 1800 4250028 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అర్ధరాత్రిని లెక్క చేయకుండా యుద్ధప్రాతిపదికన విద్యుత్తు సరఫరా చేసేందుకు శ్రమిస్తున్న సిబ్బంది సేవలను ప్రశంశించారు.