జనవరి 9న వనపర్తికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

జనవరి 9న వనపర్తికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

వనపర్తి, వెలుగు: డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క గురువారం జిల్లాలో పర్యటిస్తారని కలక్టర్  ఆదర్శ్  సురభి తెలిపారు. రేవల్లి మండలం తల్పనూర్, గోపాల్​పేట మండలం ఏదుట్ల గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్లను ప్రారంభిస్తారని చెప్పారు. వనపర్తిలోన విద్యుత్  శాఖ ఆఫీస్​ ఆవరణలో ఏడు సబ్​ స్టేషన్లకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అనంతరం కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.