భూమి లేని నిరుపేద కుటుంబానికి ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రెండు విడుతల్లో ఈ డబ్బును అకౌంట్లో వేస్తామన్నారు. మొదటి విడతగా 2024 డిసెంబర్ 28న రూ.6 వేలు అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు భట్టి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు భట్టి విక్రమార్క. అప్పులపై బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. అప్పులపై కాంగ్రెస్ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భారీగా అప్పులు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పలకు తాము వడ్డీలు కడుతున్నామని తెలిపారు భట్టి. కాంగ్రెస్ ఇప్పటి వరకు రూ.54 వే ల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. ఈ లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు రెడీగా ఉన్నామన్నారు. బీఆర్ఎస్ చేసిన తినడానికి అయితే ..కాంగ్రెస్ చేసిన అప్పులు వడ్డీలు కట్టడానికి అని అన్నారు.
ఆహార నాణ్యత విషయంలో రాజీపడేది లేదు
ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు బోనస్ రూ.500 ఇస్తున్నామన్నారు భట్టి. 10 నెలల్లో రూ.66, 722 కోట్ల అప్పులు కట్టామన్నారు. రూ. 21 వేల కోట్ల రుణమాఫీ ఏడాదిలోనే చేశామన్నారు. కాంగ్రెస్ దేశ ప్రజలకు మేలు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ లా తాము గాలి మాటలు..మాట్లాడలేం.. వాళ్లలాగా అబద్ధాలు చెప్పలేమన్నారు భట్టి.