అచ్యుతాపురం ప్రమాదం చాలా బాధాకరం.. డిప్యూటీ సీఎం పవన్

అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అచ్యుతాపురం ప్రమాదం చాలా బాధాకరమని అన్నారు పవన్ కళ్యాణ్. అచ్యుతాపురం ప్రమాదం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ కిందకు రాదని స్పష్టం చేశారు. అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలని నేను రాగానే చెప్పానని అన్నారు. సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు మూసేస్తారని యాజమాన్యాలు భయపడే పరిస్థితి ఉందని అన్నారు పవన్.

ఫ్యాక్టరీ యాజమాన్యంలో ఇద్దరు ఉన్నారని, వారు కూడా బాధ్యత తీసుకోవటం లేదని అన్నారు. పరిశ్రమల్లో పనిచేసేవారి ప్రాణాలకు రక్షణ చాలా ముఖ్యమని అన్నారు పవన్ . విశాఖపట్టణంలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తామని తెలిపారు పవన్ కళ్యాణ్.