విజయవాడ దుర్గ గుడి మెట్లను శుద్ధి చేసిన పవన్ కళ్యాణ్

విజయవాడ దుర్గ గుడి మెట్లను శుద్ధి చేసిన పవన్ కళ్యాణ్

తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం నెలకొన్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా ఇవాళ ( సెప్టెంబర్ 24, 2024 ) విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయంగా గుడి మెట్లను శుద్ధి చేశారు పవన్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కనకదుర్గమ్మ గుడి రధం, సింహాలు మాయమైతే వైసీపీ నాయకులు అపహాస్యం చేశారని మండిపడ్డారు.

సగటు హిందువుకు ఎలాంటి భయం ఉండదని, ఇతర మతాల పట్ల ద్వేషం ఉండదని అన్నారు. మేము రామభక్తులమని, ఆంజనేయస్వామిని పూజిస్తామని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి మతం మారారో లేదో తనకు తెలీదని, జగన్ పైకి వేలెత్తి చూపడం లేదని, తమ హయాంలో జరిగిన అపచారంపై సప్నదించాలని కోరుతున్నామని అన్నారు.

రాజ్యాంగం బాగుండాలి అని పాటుపడుతున్నామని, సెక్యులరిజం అన్ని వైపుల నుంచీ రావాలని అన్నారు. సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయమని అన్నారు పవన్.మసీదులో చిన్న అపచారం జరిగితే ఇలాగే మాట్లాడతారా.. హిందువుల పట్ల ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. పొన్నవోలు సుధాకర్ పొగరుగా మాట్లాడారని, తమాషాలుగా ఉందా, సరదాలుగా ఉన్నాయా అంటూ ఫైర్ అయ్యారు.