మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ..  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు గడిచిన విషయాన్ని ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఐదేళ్లే కాదు, మరో పదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉండాలని అన్నారు.సీఎం చంద్రబాబు విజన్‌కు తగ్గట్టు పనిచేస్తామని.. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబుకు మాట ఇస్తున్నానని అన్నారు.

తాము చేయాల్సిన పనులపై ఆదేశాలు ఇవ్వాలని, సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాని అన్నారు. ఈ ఐదేళ్ళలో ఏపీ ఎకానమీ 1 ట్రిలియన్ వరకు వెళ్తుందని, చంద్రబాబు పాలనపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. 

ALSO READ | విజయవాడలో యూఎస్ వీసా కేంద్రం..!

ఇదిలా ఉండగా.. గత ప్రభుత్వం నుండి వారసత్వంగా గుంతలు, శిధిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగులు, నిర్వీర్యమైపోయిన పంచాయితీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు మద్యం దోపిడీలు, ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు. ఆలయాల్లో విగ్రహ ధ్వంసాలు,  కూల్చివేతలు వచ్చాయని అన్నారు పవన్ కళ్యాణ్.