ఏపీ రాజకీయాలు ప్రస్తుతం తిరుమల లడ్డు చుట్టూ తిరుగుతున్నాయి. తిరుమల లడ్డూ తయారీ కోసం గత వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో తిరుమల లడ్డూ అంశంపై దాఖలైన పలు పిటీషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను గురువారానికి ( అక్టోబర్ 3, 2024 ) వాయిదా వేసింది. ఈ క్రమంలో తిరుమల లడ్డూ వివాదంపై నెలకొన్న తాజా పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉన్న సమాచారాన్ని మాత్రమే సీఎం చంద్రబాబు చెప్పారని.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని.. ప్రభుత్వం అన్నింటిపై విచారణ జరుపుతుందని అన్నారు.
Also Read :- ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి
ప్రాయశిత్త దీక్ష కేవలం లడ్డూ వివాదం కోసం మాత్రమే కాదని అన్నారు.లడ్డూ వివాదం కేవలం ట్రిగ్గర్ మాత్రమేనని అన్నారు. కొన్నేళ్లుగా 219 ఆలయాలు ధ్వంసం చేశారని, రామతీర్థంలో రాముడి తల నరికారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది కేవలం దీక్ష మాత్రమే కాదని.. శాశ్వత పరిష్కారం కోరుతూ చేపట్టిన దీక్ష అని అన్నారు.సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు పవన్ కళ్యాణ్.