![తిరుమల లడ్డూ వివాదం దురదృష్టకరం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..](https://static.v6velugu.com/uploads/2025/02/deputy-cm-pawan-kalyan-comments-on-tirumala-laddu-row_74BfzJhIaX.jpg)
తిరుమల లడ్డూ వివాదంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తిరుమల లడ్డూ వివాదం దురదృష్టకరం అని అన్నారు. ప్రస్తుతం సనాతన ధర్మ యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాల నుంచి ఎవరూ డబ్బులు ఆశించకూడదని.. కానీ అలా జరగకపోవడం బాధాకరమని అన్నారు. ఘటనకు బాద్యులైన నిందితులు అరెస్టయ్యారని అన్నారు పవన్ కళ్యాణ్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇటీవల సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసిన క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సనాతన ధర్మ యాత్రలో భాగంగా బుధవారం ( ఫిబ్రవరి 12, 2025 ) కేరళ, తమిళనాడులోని వివిధ పవిత్ర స్థలాలకు తీర్థయాత్ర ప్రారంభించారు పవన్ కళ్యాణ్.ఈ సందర్భంగా తమిళనాడులోని పవిత్ర స్థలాలకు ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరారు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన తన ప్రయాణంలో శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ALSO READ : Pawan Kalyan: సనాతన ధర్మ యాత్రకు బయలుదేరిన పవన్ కళ్యాణ్.. కొచ్చి శ్రీ అగస్త్య మహర్షి ఆలయ సందర్శన
ఈ క్షేత్ర సందర్శనలో పవన్ కళ్యాణ్తో పాటు ఆయన కుమారుడు అకీరా, టిటిడి సభ్యుడు శ్రీ ఆనందసాయి పాల్గొన్నారు. అలాగే పవన్ దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా అక్కడ ఇతర ముఖ్యమైన దేవాలయాలను సందర్శించనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.