ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతిభద్రతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమది మంచి ప్రభుత్వమే కానీ... మెతక ప్రభుత్వం కాదని అన్నారు. షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని అన్నారు. ఐఏఎస్ లకు వార్నింగ్‌లు ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. గత పాలకులు 20 ఏళ్లు అధికారంలో ఉంటామని అధికారులను ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకున్నారని అన్నారు.
అధికారుల మీద చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోమని అన్నారు. కాగా..గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ పోలీస్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమాలకు పాల్పడితే అడ్రస్ లేకుండా చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్, ట్రాఫిక్ సమస్యలు వంటి కీలక అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్.