డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో ఊరట...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు గాను కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును క్వాష్ చేయాలనీ కోరుతూ పవన్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. పవన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్టే విధించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం.

వైసీపీ రాష్ట్రంలో 30 వేల మంది యువతులు అదృశ్యమయ్యారని, ఈ ఘటనలకు వాలంటీర్లే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్.  వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సేకరించిన డేటానే  ఇందుకు కారణమని అప్పట్లో ఆరోపించారు పవన్ కళ్యాణ్. ఈ వ్యాఖ్యలపై అప్పటి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లతో ఫిర్యాదులు చేయించింది. కాగా, ఈ పిటిషన్ ను క్వాష్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల పిటిషన్ దాఖలు చేయటంతో విచారణ జరిపిన హైకోర్టు స్టే విధిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.