Deputy CM Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష చేయబోతున్నారు. బుధవారం(జూన్ 26) నుంచి ఆయన వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. జూన్ 26 నుండి 11 రోజుల పాటు ఈ దీక్షలో ఉండనున్నారు పవన్ కళ్యాణ్. దీక్షా కాలంలో కేవలం పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు.

ఇక గత ఏడాది జూన్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని నామకరణం చేసుకున్నారు పవన్. రాష్ట్రం మొత్తం ఆ వాహనంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాదించారు సేనాని. అందులో భాగంగానే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి వచ్చాక ఇప్పడు మరోసారి 11 రోజుల పాటు అమ్మవారి దీక్షలో ఉండనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.