ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగళూరులో అటవీ శాఖపై జరిగిన రివ్యూ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ పవన్ కల్యాణ్ అన్న కామెంట్స్ ఏమన్నారో చూద్దాం.. 40 ఏళ్ల క్రితం సినిమా హీరో అంటే అడవులను కాపాడేవాడు.. అదే ఇప్పుడు.. అడవులను నరికితేనే హీరో అంటున్నారు. ఈ 40 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అంటూ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో రచ్చ అవుతున్నాయి.
కర్నాటక రాష్ట్రం వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవుల రక్షణ.. ఎర్రచందనం స్మగ్లింగ్ అంశాలపై.. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యి చర్చించారు. అనంతరం కర్నాటక అటవీ శాఖ మంత్రితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఏపీ, కర్నాటక సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతంలో అటవీ సంపద పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బెంగళూరులోనే మీడియాతో మాట్లాడుతూ.. పైన చెప్పిన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ సినిమా పుష్ప గురించే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తు్న్నారు. ఎందుకంటే పుష్ప మూవీ ఎర్రచందనం స్మగ్లింగ్ గురించే.. ఆ సినిమాలో హీరో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్.. దీంతో అల్లు అర్జున్ ను టార్గెట్ చేసి పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో హీరో అడవులను కాపాడాడు అంటే అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణంరాజు వంటి హీరోలు అడవుల పరిరక్షణ, అటవీ ప్రాంతాల ఆధారంగా సినిమాలు తీశారు. ఇప్పుడు పుష్ప మూవీ మాత్రం ఎర్ర చందన స్మగ్లింగ్ గురించి ఉంటుంది.. అందులో హీరో పాత్రనే స్మగ్లర్.. సో.. ఇంకా ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నది అల్లు అర్జున్ గురించే అంటున్నారు అల్లు ఫ్యాన్స్..