Pawan Kalyan, Supriya: మొదటి సినిమా హీరోయిన్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan, Supriya: మొదటి సినిమా హీరోయిన్తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమైన విషయం తెల్సిందే. విజయవాడ లోని ఆయన క్యాంపు ఆఫీస్ లో జరిగిన ఈ సమావేశానికి టాలీవుడ్ నుండి ప్రముఖ నిర్మాతలు అందరు హారాజయ్యారు. ఇందులో భాగంగా చిత్ర పరిశ్రమలోని సమస్యలు, వాటి పరిష్కారం, ఏపీ సినిమా పరిశ్రమ డెవలప్మెంట్ గురించి చర్చించినట్టు సమాచారం. 

అయితే ఈ సమావేశంలో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అదేంటంటే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో జరిగిన సమావేశానికి ఆయన మొదటి హీరోయిన్ సుప్రియా యార్లగడ్డ కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిలో హీరోయిన్ గా సుప్రియా యార్లగడ్డ నటించిన విషయం తెలిసిందే. దాదాపు 28 సంవత్సరాల తరువాత సుప్రియా పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సంధర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.