పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి.. కిరణ్ రాయల్ కు పవన్ కళ్యాణ్ ఆదేశాలు..

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి.. కిరణ్ రాయల్ కు పవన్ కళ్యాణ్ ఆదేశాలు..

గత కొద్దిరోజులుగా జనసేన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ పై మహిళ ఆరోపణలు, అందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ మీద వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయి పరిశీలన జరపాలని ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నుండి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు జనసేన పార్టీ కార్యక్రమాలకు కిరణ్ రాయల్ దూరంగా ఉండాల్సిందిగా జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

కిరణ్ రాయల్ తన వద్ద కోటి రూపాయలకు పైగా అప్పు తీసుకుని మోసం చేశారంటూ ఓ మహిళ సెల్ఫీ వీడియో విడుదల చేయటం సంచలనం రేపింది. కిరణ్ రాయల్ తన దగ్గర కోటి రూపాయలకు పైగా నగదు, 25 సవర్ల బంగారం తీసుకున్నారని.. తిరిగి అడుగుతుంటే  బెదిరిస్తున్నారని, తనకు చావే శరణ్యం అంటూ వీడియోలో పేర్కొంది మహిళ. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పాటు.. కిరణ్ రాయల్‌కు సంబంధించిన ఓ ఆడియో, వీడియో లీక్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. ఆదివారం ( ఫిబ్రవరి 9, 2025 ) కిరణ్ రాయల్ ఇంటిని ముట్టడించాయి మహిళా సంఘాలు. కిరణ్‌ రాయల్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశాయి.ఈ క్రమంలో మహిళ ఆరోపణలపై స్పందించిన కిరణ్ రాయల్ప.. దేళ్ల క్రితం జరిగి, అప్పడే సెటిల్‌ అయిన అంశాన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారని అన్నారు. దీని వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు కిరణ్ రాయల్ .

ALSO READ | కులగణన మళ్లీ చేస్తే నేను ,కేసీఆర్ పాల్గొంటాం : కేటీఆర్

ఈ అంశంపై త్వరలోనే కోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నానని.. తన ఫోన్ కేసు హైకోర్టులో ఉందని అన్నారు. మొత్తానికి కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ పార్టీ అధిష్టానం ఆదేశించిన క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి చూడాలి.