సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. రాష్ట్రానికి గూగుల్ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. సంక్షభంలోనూ సమర్థవంతంగా పాలించటం చంద్రబాబుకే సాధ్యమైందని అన్నారు పవన్ కళ్యాణ్.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని.. మూలాలనే పెకలించేసిందని, భారీగా అవకతవకలకు పాల్పడిందని అన్నారు. ప్రజలు తమపై బృహత్తర బాధ్యత పెట్టారని.. ప్రభుత్వం పాలసీలు మాత్రమే తీసుకురాగలదని.. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్ లే అని అన్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు విక్రయం మొదలు.. ఎన్నో పనులు చేయించారని అన్నారు. ఇంతమంది ఐఏఎస్ లు ఉండీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారని అన్నారు.
గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిందని.. నేడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని అన్నారు. రాళ్లు, రప్పలున్న ప్రదేశంలో చంద్రబాబు సైబరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించారని.. ఆయన నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టమని అన్నారు
Also Read :- మొహం మీద మైకు పెట్టడం వల్లే కొట్టారు
కాకినాడ పోర్టు నుంచి మూడు చెక్ పోస్టులు పెట్టినా బియ్యం అక్రమ రవాణ ఆగడం లేదని.. సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదుల వలన 300 మంది ప్రాణాలు పోయాయని అన్నారు పవన్ కళ్యాణ్. మంత్రి మనోహర్ తనిఖీలకు వెళితే సహకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా అని ప్రశ్నించారు. పాలన అంటే ఏపీలో లాగా ఉండాలని దేశమంతా అనుకోవాలని.. అందుకు ఐఏఎస్ లే బాధ్యత తీసుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్.