జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే తాను హోంమంత్రి బాధ్యతలు చేపట్టాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరించారు. ముఖ్యంగా విమర్శలు చేసే వారిని వదలద్దని పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమన్న జనసేనాని.. ఈ విషయంలో ప్రస్తుత ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. డీజీపీ, పోలీసు అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.
Also Read:-పవన్ కళ్యాణ్‌పై TGPSC మాజీ చైర్మన్ సెటైర్లు
క్రిమినల్స్‌కి కులం మతం ఉండదు
"క్రిమినల్స్‌కి కులం, మతం ఉండదు. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి? క్రిమినల్స్‌ను వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది. అత్యాచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. అధికారులకు, ఎస్పీలకు చెబుతున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు కీలకం. హోంమంత్రి అనిత ఈ ఘటనలపై చురుగ్గా వ్యవహరించాలి. నేను ఆ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయి. నేతలు ఇలానే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉంటే హోంమంత్రి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటా.." అని పవన్ కళ్యాణ్ అన్నారు.