ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మొన్నటి దాకా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఉప్పాడ తీరప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎన్నికల సమయంలో ఉప్పాడ ప్రజలకు ఇచ్చిన హామీ ,మేరకు ఉప్పాడ తీరప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుండి కాపాడే విధంగా కార్యాచరణకు సిద్ధమయ్యారు పవన్.
బుధవారం ( జూలై 3, 2024 )నాడు ఉప్పాడ తీరంలో కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్.ఈ పర్యటనలో మారిటైం బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్. సముద్ర కోతకు గల కారణాలు, నివారణోపాయాల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న పవన్... కోతను నివారించే మార్గాలను అన్వేషించాలి అధికారులు ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వం నుండి పూర్తి సహాయం ఉంటుందని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకు సూచనలు ఇచ్చారు పవన్ కళ్యాణ్.