తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ ట్వీట్.. కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్..

తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ ట్వీట్.. కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్..

ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును వాడారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఈ వివాదంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది.ఈ క్రమంలో తిరుమల లడ్డూ వివాదంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.

ALSO READ : తిరుమల నెయ్యిలో వనస్పతి అవశేషాలు మాత్రమే ఉన్నాయి : టీటీడీ ఈవో వివరణ

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న విషయం తెలిసి తీవ్రంగా కలత చెందానన్నారు పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉపయోగించి, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మరక్షణ కోసం జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ALSO READ : 

దేశవ్యాప్తంగా ఆలయాల రక్షణపై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సి ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మానికి ముప్పు ఎలా వచ్చినా అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు పవన్. లడ్డూ వివాదంపై వైసీపీ హయాంలో ఏర్పడిన టీటీడీ బోర్డు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై కచ్చితంగా సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.