పిఠాపురం కృతజ్ఞత సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సభలో ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు అడ్డుపడ్డ నేపథ్యంలో వారికి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.ప్రేమగా మాట్లాడుతున్నానని అలుసుగా తీసుకోవద్దని, అలుసుగా చుస్తే అంతు చూస్తానని హెచ్చరించారు.ఇలాంటి వారికి జగన్ లాంటి వారే కరెక్ట్ అని అన్నారు. మాట్లాడితే కొట్టే వారి దగ్గర భయంగా ఉంటారని, ప్రేమగా ఉండే తనలాంటి వారిని చులకనగా చూస్తారని అన్నారు.
తనకు భయల్లేవని, తనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నారు పవన్. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని, నియమాలు, ప్రోటోకాల్ పాటిస్తానని, అలుసుగా తీసుకుంటే మాత్రం సహించనని అన్నారు.గెలిచాం కదా అని తల ఎగిరేయద్దని, వైసీపీకి 11సీట్లు వచ్చినా, 1సీటు వచ్చినా వారిపై దాడులకు దిగటం కరెక్ట్ కాదని అన్నారు.వైసీపీకి 151సీట్లు ఇచ్చి కాలం పరీక్ష పెట్టిందని, వారు ఆ పరీక్షలో ఓడిపోయారని, అది జనసైనికులు పాఠంగా తీసుకోవాలని అన్నారు.
తనకు వ్యక్తిగత కక్ష్యలు లేవని,తప్పు చేసినవారు చట్టానికి దొరికితే పర్యవసానాలు అనుభవిస్తారని అన్నారు.సమ్యవనం పాటించటమే జనసేనకు వైసీపీకి తేడా అని అన్నారు. జనసైనికులు క్రమశిక్షణగా ఉండాలని అన్నారు. తనకు తిట్టడానికి కూడా టైం లేదని, చాలా పని ఉందని అన్నారు.