ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో లిక్కర్ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్వేతపత్రంలో చెప్పినదానికంటే ఎక్కువ అక్రమాలు జరిగాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ అక్రమాల వల్ల రాష్ట్ర ఖజానాకు 18వేల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని అన్నారు పవన్ కళ్యాణ్.
ALSO READ | ఏపీలో రెడ్ బుక్ కిరాతక పాలన చూడండీ : ఢిల్లీలో జగన్ ఎగ్జిబిషన్
కేంద్ర బడ్జెట్ లో 15వేల కోట్లు వస్తేనే సంతోషించాం కానీ, 18వేల కోట్లు ఖజానాకు వచ్చి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. లిక్కర్ స్కాంకు కారకులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలని సీఎంను కోరారు. తప్పులు చేసినవారిని వదిలేస్తే మనకు మాట్లాడే నైతిక హక్కు ఉండదని అన్నారు. 20వేలు లంచం తీసుకుంటున్న సామాన్య ఉద్యోగిని శిక్షించగలుగుతున్న మనం.. ఇంత భారీ స్కాంకు పాల్పడ్డవారిని వదిలిపెట్టొద్దని అన్నారు.పెద్దోళ్ళు తప్పు చేస్తే శిక్షలుండవా అని సామాన్యుడు ఫీల్ అవ్వకూడదని అన్నారు.