- ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు
- హిమాచల్ సీఎం సుఖ్విందర్తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
- హైడల్ ప్రాజెక్టుల ఏర్పాటుకు డిస్కషన్.. త్వరలోనే ఎంవోయూ!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు కరెంటు సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ హైడల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి కరెంట్ తెచ్చుకునేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్‌సింగ్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. అక్కడ హైడల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించారు. గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఇందులో ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కూడా పాల్గొన్నారు. వంద మెగావాట్లకు పైగా హైడల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతూ అధికారికంగా హిమాచల్‌ప్రదేశ్ అధికారులకు తెలంగాణ అధికారులు లెటర్ అందజేశారు.
బూట్ విధానంలో భాగంగా..!
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ( బూట్) విధానంలో 22 హైడల్ ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ అధికారుల బృందం హిమాచల్ ప్రదేశ్ ను సందర్శించి, ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శితో సమావేశమై చర్చలు జరిపింది. హిమాచల్‌లోని ఎస్ఈఎల్ఐ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు (400 మెగావాట్లు), ఎంఐవైఏఆర్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు(120 మెగావాట్లు)ల ప్రాంతాలను పరిశీలించింది. 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్ సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ప్రాజెక్టుల ఏర్పాటుపై డిస్కస్ చేశారు. ప్రాజెక్టుల ఒప్పందం ముసాయిదాను పంపించాలని.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తగిన పరిశీలన చేసి, ఎంవోయూపై సంతకం చేసేందుకు చర్యలు చేపడ్తుందని సుఖ్విందర్ సింగ్‌కు భట్టి విక్రమార్క తెలిపారు. తాజా ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే హిమాచల్‌ప్రదేశ్‌లోని హైడల్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తయ్యే కరెంట్ కూడా తెలంగాణ రాష్ట్రానికి సరఫరా అవుతుంది.