డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలి : రేవూరి ప్రకాశ్​రెడ్డి

డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలి : రేవూరి ప్రకాశ్​రెడ్డి

శాయంపేట, వెలుగు : ఈ నెల 5న మండలానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఆత్మకూర్​ మండలం అగ్రంపహాడ్​లోని సమ్మక్క–సారలమ్మ గద్ద వద్ద జీఎస్​ఆర్​ కన్వెన్షన్​ల్​ హాల్​లో మంగళవారం నియోజకవర్గ కాంగ్రెస్​పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజీ ప్రధాని ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించి, ఆయన సేవలను కొనియాడారు. ఈనెల 5న మండలానికి వస్తున్న డిప్యూటీ సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. మొగిలిచర్ల , గొర్రెకుంట, విశ్వనాథపురంలో ఏర్పాటు చేసిన సబ్​స్టేషన్లను డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నట్లు చెప్పారు.