హైదరాబాద్, వెలుగు: సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ చార్మినార్ జోన్ సర్కిల్–8 డిప్యూటీ కమిషనర్ రిచా గుప్తా ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఫయాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. సివిల్ కాంట్రాక్టర్ ఉమర్ అలీఖాన్ సర్కిల్–8 పరిధిలోని చాంద్రాయణగుట్టలో రూ.4 లక్షల కాంట్రాక్ట్ పనులు చేశారు.
బిల్స్ కోసం ఇన్స్‌స్పెక్షన్ రిపోర్ట్ ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ రిచా గుప్తాను పలుమార్లు కోరాడు. అయితే, బిల్స్అప్రూవల్కోసం రిచా గుప్తా లంచం డిమాండ్ చేసింది. దీంతో అలీఖాన్ ఈ నెల 21 ఏసీబీకి కంప్లైంట్ చేశాడు.
ట్రాప్ స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు చార్మినార్ జోనల్ ఆఫీస్‌లో ఆపరేటర్సతీశ్ఈ లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సతీశ్ చెప్పిన వివరాలతో రిచా గుప్తాను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి ప్రధాన నిందితురాలిగా ఆమె పేరును చేర్చారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో వారిని ప్రొడ్యూస్ చేశారు.